ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: మన్మోహన్ సింగ్
posted on May 17, 2014 11:38AM
.jpg)
ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని శనివారం మాజీ ప్రధాని కాబోతున్న ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు.15వ లోక్‌సభను రద్దు చేయాలన్న కేబినెట్ ఈరోజు తీర్మానం చేయనున్న నేపథ్యంలో మన్మోహన్ సింగ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన జీవితం తెరచిన పుస్తకమని ఆయన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి, పదేళ్ల యూపీఏ పాలనకు బాధ్యత వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. గత పదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యకర్తలు చేశామన్నారు. దేశానికి చేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. వచ్చే ప్రభుత్వానికి విజయాలు కలగాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో భారత్ సూపర్‌శక్తిగా తయారుకావాలని అన్నారు. ప్రధానికి ఇదే తన చివరి మీడియా సమావేశమని ఆయన స్పష్టం చేశారు.