సోనియాగాంధీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
posted on Jan 6, 2026 11:41AM

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను మంగళవారం (జనవరి 6) ఉదయం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య సరిస్థితిని పర్యవేక్షిస్తున్నది.
కాగా సోనియాగాంధీ ఆరోగ్యంపై ఇప్పటి వరకూ ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటిన్ ను విడుదల చేయలేదు. అలాగే కాంగ్రెస్ నుంచి కూడా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. సోనియా గాంధీ నాయకత్వంలో, పార్టీ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చింది. కాగా ఆరోగ్య కారణాలతోనే ఆమె 2017లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.