బంగ్లాదేశ్ లో హిందువులపై ఆగని దౌర్జన్యకాండ
posted on Jan 6, 2026 12:30PM

బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం (జనవరి 5) ఒకే రోజు మూడు వేరువేరు ఘటనల్లో ఇద్దరు మరణించగా, ఓ మహిళలకు ఘోర అవమానం జరిగింది. ఓ వితంతువుపై గ్యాంగ్, ఓ జర్నలిస్టు, ఓ వ్యాపారి హత్య జరిగాయి. సోమవారం (జనవరి 5)ఒక్క రోజే జరిగిన ఈ మూడు ఘటనలూ బంగ్లాదేశ్ లో హిందువుల భద్రత గాలిలో దిపంగా ఉందని తేటతెల్లం చేస్తున్నాయి. వివరాల్లోకి వెడితో.. కాళీగంజ్ లో 40 ఏళ్ల హిందూ వితంతువుపై ఇద్దరు యువకులు సోమవారం (జనవరి 5) సామూహిత అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెను చెట్టుకు కట్టేసి ఆమె జుత్తు కత్తిరించారు. అదే రోజు సాయంత్రం మరో ఘటనలో జశోర్ జిల్లా కాపాలియా బజార్ లో స్థానిక దినపత్రికకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న జర్నలిస్ట్ రాణా ప్రతాప్ అనే యువకుడిని దుండగులు హత్య చేశారు.
కాపాలియా బజార్ లో ఓ ఐస్ ఫ్యాక్టరీని కూడా నిర్వహిస్తున్న రాణా ప్రతాప్ ను అతడి ఫ్యాక్టరీ దగ్గరే దారుణంగా కాల్చి చంపారు. ఇక అదే రోజు రాత్రి నార్సింగ్ది లోని బ్రాహ్మండికి చెందిన శరత్ చక్రవర్తి మణి అనే కిరాణాషాపు యజమానిపై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. పాకిస్థాన్ లో హిందువులపై ఎడతెగకుండా జరుగుతున్న దాడుల పట్ల సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ దారుణాలపై అక్కడి పోలీసులు నామ్ కే వాస్తే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.