కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం.. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ!
posted on Feb 3, 2020 10:52AM

అనారోగ్యం తో ఢిల్లీ లోని గంగా రాం ఆసుపత్రిలో చేరారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ విషయం తెలియగానే పలువురు నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. జ్వరం , శ్వాస సంబంధ సమస్యతో సోనియా బాధపడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఆమె హెల్త్ కండిషన్ పై ఆస్పత్రి వర్గాల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. గత కొంతకాలంగా సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ప్రత్యేక వైద్య చికిత్స కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సోనియా వెంట రాహుల్, ప్రియాంక కూడా ఉన్నారు. గతంలో కూడా.. అనారోగ్యంతో కొన్నాళ్లు ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నారు సోనియా గాంధీ. తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప అనారోగ్యమేనని ప్రమాదమేమీ లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఆమె అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకుంటారు. ఇప్పుడు కూడా రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఆమె సర్ గంగా రాం ఆసుపత్రిలో చేరినట్లు నేతలు వెల్లడించారు. సోనియా గాంధీ ఆసుపత్రి లో చేరారన్న సమాచారం తెలియడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.