సోనియా గాంధీ..ఇరాన్ వైపు ఎందుకున్న‌ట్టు ఆమె క్రిష్టియ‌న్ క‌దా?

 

కాంగ్రెస్ ని బేసిగ్గా ఖాన్.. గ్రెస్ అని అంటారు. ఎందుకంటే ఈ పార్టీ తొలి  నుంచి ముస్లిం ప్రీతి  పాత్ర‌మైన పార్టీగానే పేరు సాధిస్తూ వ‌చ్చింద‌ని చెబుతారు. ఇదంతా ఇలా ఉంటే సోనియా గాంధీ ఫ‌క్తు క్రిష్టియ‌న్. ఒక వేళ ఆమె ఇరాన్- ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంటే స‌పోర్ట్ చేయాల్సింది ఇజ్రాయెల్ కి. కార‌ణం ఆమె పాటించే క్రైస్త‌వం పుట్టిందే ఇజ్రాయెల్ లోని బెత్లెహామ్ లో. బెత్లెహామ్ జెరూస‌లేమ్ కి ద‌క్షిణంగా ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో ఉండే ఒకానొక చిన్న ప‌ట్ట‌ణం. బైబిల్ ప్ర‌కారం.. ఏసు ఒక తొట్టెలో ఇక్క‌డ మ‌రియా జోసెఫ్ ల కుమారుడిగా జ‌న్మించాడు. ఇక్క‌డి చ‌ర్చ్ ఆఫ్ నేటివిటీని ఏసు జ‌న్మ‌స్త‌లంగా భావిస్తారు.మీరు కావాలంటే చూడండి.. భార‌త్ లోని అత్య‌దిక క్రైస్త‌వులు.. ఇరాన్ వైపా ఇజ్రాయెల్ వైపా అంటే తాము ఇజ్రాయెల్ వైపేనంటారు.  కార‌ణం ఇజ్రాయెలే క్రైస్త‌వ జ‌న్మ‌స్థ‌లి  కాబ‌ట్టి వారి అభిమానం అలా ఉంటుంది. 

కానీ ఇక్క‌డ చూస్తే సోనియాగాంధీ ఆచారం పాటించ‌డానికి క్రైస్త‌వం పాటిస్తారు. త‌న కుమార్తెను సైతం ఒక క్రైస్త‌వుడైన రాబ‌ర్ట్ వాద్రాకిచ్చి పెళ్లి చేశారు. కానీ ఇరాన్ వైపు వంత పాడుతున్నారు. బేసిగ్గా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని అర్ధం చేసుకోద‌లిస్తే.. ఇక్క‌డేం క‌నిపిస్తుందంటే ఇరాన్ ద‌గ్గ‌ర అణు శ‌క్తి క‌రెక్టు కాదు. కార‌ణం ఆ నిల్వ‌ల  కార‌ణంగా హ‌మాస్, హిజ్బుల్లా త‌దిత‌ర ఇస్లామిక్ సంస్థ‌ల చేతుల్లోకి ఈ అణు శ‌క్తి మొత్తం వెళ్తుంది. గ‌తంలో ఇదే పాకిస్తాన్ అణు దేశ‌మైన‌పుడు. ఆ దేశ అణు శాస్త్ర‌వేత్త సుల్తాన్ బ‌షీరుద్దీన్.. లాడెన్ కి అణు సాంకేతిక ప‌రిజ్ఞానం ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఈ విష‌యంపై ఎఫ్ బీ ఐ కూడా సీరియ‌స్ అయితే.. ఐఎస్ఐ అత‌డ్ని విచారించ‌డ‌మే కాదు అప్ప‌ట్లో అత‌డి ప‌ద‌వి నుంచి కూడా తొల‌గించారు.అందుకే ఇజ్రాయెలీ మొస్సాద్ ఇరాన్ కి సంబంధించిన అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను వ‌రుస బెట్టి హ‌తం చేస్తూ వ‌చ్చింది. ఆప‌రేష‌న్ నార్నియా పేరిట 2022 నాటి నుంచి వీరిపై టార్గెట్ పెడుతూ వ‌స్తోంది. 

తాజా యుద్ధంలో  కూడా ఇరాన్ అణు కేంద్రాల‌పై బాంబులు వేయ‌డం మాత్ర‌మే కాకుండా అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను ఇప్ప‌టి  వ‌ర‌కూ చాలా మందిని హ‌త‌మార్చింది. ఇదంతా ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే ఇజ్రాయెల్ చేస్తోంది. దీన్ని అర్ధం చేసుకోకుండా ఇరాన్ వైపు సోనియాగాంధీ ఉండ‌ట‌మేంట‌న్న‌ది చాలా మందికి అర్ధం  కాని  ప్ర‌శ్న‌.1979 వ‌ర‌కూ ఇరాన్, ఇజ్రాయెల్ మిత్ర దేశాలే. ఎప్పుడైతే.. ఇరాన్ ఇస్లామిక్ రెవ‌ల్యూష‌న్ ప్రకారం వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లైందో అప్ప‌టి నుంచి.. ఇరాన్ మ‌త‌ప‌ర‌మైన విధానాలు పాటిస్తూ వ‌చ్చింది. లెబ‌నాన్ కి దాని ఉగ్ర సంస్థ అయిన హిజ్బుల్లాకు నిధులు, ఆయుధాలు ఇవ్వ‌డంతో పాటు ఈ తీవ్ర‌వాదుల‌కు శిక్ష‌ణ కూడా ఇవ్వ‌డం  మొద‌లైంది. ఇక హామాస్ సంగ‌తి స‌రే స‌రి. ఇరానియ‌న్ ఇస్లామిస్టులు హ‌మాస్ కి వీరాభిమానులు. ఒక వేళ ఇజ్రాయెల్ వీరిపై దాడులు చేయ‌కుంటే.. 

ఈ దేశం ఉనికి ఇక్క‌డి క్రైస్త‌వం మొత్తం మ‌ట్టి కొట్టుకుపోతుంది. క్రీస్తు పుట్టిన ఆన‌వాళ్ల‌ను హ‌మాస్ నామ‌రూపాల్లేకుండా చేస్తుంది.అలాంటి త‌న జ‌న్మ‌త‌హ వ‌చ్చిన క్రైస్త‌వాన్ని వ‌దిలి.. ఇరాన్ వైపు సోనియా నిలుస్తాన‌ని అన‌డంలో అర్ధ‌మేంటి? అన్న‌దెవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. దానికి తోడు ఇజ్రాయెల్ ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌న‌కు ఎంతో సాంకేతిక స‌హ‌కారం అందిస్తోంది. మొన్న‌టి ఆప‌రేష‌న్ సిందూర్  విష‌యంలో.. స్కై స్ట్రైక‌ర్లను మ‌నం అంత విజ‌య‌వంతంగా ప్ర‌యోగించామంటే అందుకు కార‌ణం ఇజ్రాయెల్ ఆయుధ సాంకేతిక ప‌రిజ్ఞాన‌మే. మ‌నం సంప్ర‌దాయంగా ఇజ్రాయెల్ వైపు ఉంటూ వ‌స్తున్నాం. కార‌ణం మ‌నం ఇస్లామిక్ ఉగ్ర‌వాదానికి విప‌రీత‌మైన బాధితులం. కానీ సోనియా చూస్తే తాము ఇరాన్ వైపే ఉంటామ‌న‌డంలో అర్ధ‌మేంటి? అంటే ఇస్లామిక్ తీవ్ర‌వాదానికి కొమ్ము కాస్తామ‌నా? అన్న‌ది త‌మ‌కు అర్ధం కావ‌డం లేదంటున్నారు చాలా మంది.