రాహుల్ తో రేవంత్ భేటీ
posted on Dec 11, 2025 9:50AM
.webp)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ మీట్ వివరాలను రేవంత్ వారికి వివరించారు.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం(డిసెంబర్ 11). తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం (డిసెంబర్ 10)రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కూడా పాల్గొన్నారు.ఈ విందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా వచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారిలో కొద్ది సేపు ముచ్చటించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విశేషాలు వివరించారు.