రైతు బంధు డబ్బుల కోసం తండ్రి నాలుక కోసేసిన కొడుకు

రైతు బంధు డబ్బుల విషయంలో  ఘర్షణ పడి తండ్రి నాలుక కోసేసిన సుపుత్రుడి ఉదంతమిది. ఈ దారుణం మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తాండాలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. రైతు బంధు డబ్బులు ఇవ్వలేదని తండ్రిపై కోపంతో దాడి చేసి నాలుకు కోసేశాడో సుపుత్రుడు. తాండాకు చెందిన బానోత్ కిర్యా కు ఇద్దరు కుమారుడున. రైతు బంధు పథకం కింద బానోత్ కిర్యా ఖాతాలో ఇటీవల తొమ్మిది వేల రూపాయలు జమ అయ్యాయి.  ఎకరాకు రూ.6 వేల చొప్పున  ఎకరంన్నర పొలం ఉండటంతో తొమ్మిదివేలు కిర్యా ఖాతాలో జమ అయ్యాయి.  ఆ సొమ్ములు తనకు ఇవ్వాలని చిన్న కుమారుడు సంతోష్ కోరాడు.

అయితే తండ్రి కిర్యా మాత్రం తాను నాలుగువేల రూపాయలు మాత్రమే ఇస్తాననీ, తన అనారోగ్యం కారణంగా ఐదు వేలు ఖర్చయ్యయనీ చెప్పాడు. దీంతో  ఆగ్రహానికి గురైన సంతోష్ తండ్రిపై దాడి దాడి చేసి కొడవలితో తండ్రి నాలుకను అతడు కోసేశాడు. ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా నాలుగు కుట్టుపడ్డాయి,   కీర్యా భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు.