ఆ చీకటి రోజులపై ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకం.. మోడీ

దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఎమర్జెన్సీ డైరీస్ అన్న పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఎమర్జెన్సీ చీకటి రోజులలో ఎదురైన పరిస్థితులు, ఇబ్బందులపై  ది ఎమర్జెన్సీ  ఈ ప్రత్యేక పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు తాను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నట్లు పేర్కొన్న ఆయన ఆ సమయంలో తన ప్రయాణం ఎలా సాగిందో ది ఎమర్జెన్సీ డైరీస్ పుస్తకంలో వివరించినట్లు తెలిపారు.

ఎమర్జెన్సీ కాలంలో చాలా మందికి అనుభవాలు ఉన్నాయని.. ఎన్నో కుటుంబాలు బాధపడ్డాయని గుర్తుచేశారు. ఆనాటి పరిస్థితుల్ని యువతకు అవగాహన కల్పించాలని కోరారు. ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.