ఆటోన‌గ‌ర్ స్థ‌లాల‌కు ప‌ట్టాలు రిజిస్ట్రేష‌న్ చేయిస్తాం.. కేశినేని చిన్ని

ఆటోన‌గ‌ర్ అనుబంధ సంఘాల‌తో ఆత్మీయ స‌మావేశం 
ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేశినేని శివ‌నాథ్ 
చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఐలా ఏర్పాటు  


జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తీసుకువ‌చ్చిన జీవో నెంబ‌ర్ 5,6 వ‌ల్ల ఆటోన‌గ‌ర్ ఆటోమొబైల్ కార్మికులు, య‌జ‌మానులు చాలా అయోమ‌యానికి గురై తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డారు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ జీవో వ‌ల్ల కార్మికులు ఉపాధి కోల్పోతారు. కార్మికుల‌కి, ఆటోన‌గ‌ర్ మ‌నుగ‌డికి ప్ర‌మాదక‌ర‌మైన ఈ జీవోను చంద్ర‌బాబు గారు అధికారంలోకి రాగానే ర‌ద్దు చేయ‌టం జ‌రుగుతుంద‌ని బిజెపి, జ‌న‌సేన బ‌ల‌ప‌రిచిన టిడిపి విజ‌య‌వాడ ఎంపి అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) చెప్పారు.  తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని ఎన్.ఎ.సి క‌ళ్యాణ‌మండ‌పంలో మంగ‌ళ‌వారం ఆటోన‌గ‌ర్ అనుబంధ సంఘాల స‌భ్యుల‌తో ఆత్మీయ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్యఅతిధిగా కేశినేని శివ‌నాథ్ , జిల్లా అధ్య‌క్షులు నెట్టెం ర‌ఘురామ్, ఎమ్మెల్యే అభ్య‌ర్ది గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి  పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ 1966లో ఏర్పాటైన ఆటోన‌గ‌ర్ అభివృద్ది  తెలుగుదేశం ప్ర‌భుత్వంలోనే జ‌రిగింద‌న్నారు. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఆటోన‌గ‌ర్ లో ఐలా ఏర్పాటు చేయ‌టం జ‌రిగింద‌న్నారు. ఐలా ఏర్పాటు చేయ‌టం వ‌ల్ల ఆటోన‌గ‌ర్ స‌మ‌స్య‌ల‌తో పాటు, ఆటోమొబైల్ కార్మికుల స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్కారం అయ్యాయ‌న్నారు. ఆటోన‌గ‌ర్ లో ఐలా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టానికి జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నాడు. అందుకే ఇంత‌వ‌ర‌కు ఐలా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేదు. నిర్వ‌హిస్తే టిడిపి ప్యానెల్ నెగ్గుతుంద‌ని జ‌గ‌న్ తెలుసే...ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేద‌ని మండిప‌డ్డారు. ఎన్డీయే ప్ర‌భుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయ‌క‌త్వంలో ఐలా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. 

2014-19 మ‌ధ్య కాలంలో ఆటోన‌గ‌ర్ లో ఆటోమొబైల్, ట్రాన్స్ ఫోర్ట్ రంగం చాలా అభివృద్ది సాధించింది.అప్పుడు మెకానిక్స్ దగ్గ‌ర నుంచి టింక‌రింగ్, పెయింటింగ్ అంద‌రికి ప‌నులు వుండేవి. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. అధికారంలోకి రాగానే ఆటోన‌గ‌ర్ కి పూర్వ వైభ‌వం తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తాను. కాల‌నుగుణంగా ఆటోమొబైల్ కార్మికులు నైపుణ్యం పెంపొందించుకునేందుకు వీలుగా సిల్క్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్స్ ఏర్పాటు చేయిస్తాన‌ని చెప్పారు. 

అలాగే ఆటోన‌గ‌ర్ ఏర్ప‌డి 58 సంవ‌త్స‌రాలు అవుతున్నా...ఇప్ప‌టి వ‌ర‌కు తాగునీటి స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. ఇక్క‌డ వాట‌ర్ క‌ట్టినా..క‌నెక్ష‌న్స్ ఇచ్చే విష‌యంలో జాప్యం చేస్తున్నారు. అలాగే ఆటోన‌గ‌ర్ లో ప్ర‌ధాన స‌మ‌స్య అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్య‌వ‌స్థ స‌రిగా లేదు. దీంతో చిన్నపాటి వ‌ర్షం ప‌డినా ఆటోన‌గ‌ర్ మునిగిపోతుంది. అలాగే గుంట తిప్ప డ్రైయిన్ స‌మ‌స్య ప్ర‌ధానం గా వుంది. ఈ స‌మ‌స్య‌ల‌తో పాటు బందురు రోడ్డు, ఏలూరు రోడ్డు కు క‌నెక్టివిటి ఏర్పిచే సాల్వెంట్ రోడ్డు ఆక్ర‌మ‌ణ‌కు గురైంది.

ఈ స‌మ‌స్య‌ల‌న్నీ గ‌ద్దె రామ్మోహ‌న్, నెట్టం ర‌ఘురామ్‌, బోడె ప్ర‌సాద్ ల‌తో క‌లిసి చంద్ర‌బాబు  దృష్టి తీసుకువెళ్లి పరిష్కరించేంత వ‌ర‌కు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర జ‌రిగిన‌ప్పుడే తెలుగుదేశం జాతీయ పార్టీ ప్ర‌ధాన  కార్య‌ద‌ర్శి లోకేష్ ను ఆటోన‌గ‌ర్ తీసుకురావ‌టానికి ప్ర‌య‌త్నించాను. అయితే ఆ రోజు ఆదివారం కావ‌టం వ‌ల్ల సాధ్య‌ప‌డ‌లేద‌న్నారు. పాత ప‌ద్దతుల్లో న‌డుస్తున్న ఆటోన‌గ‌ర్ ను అప్ గ్రేడెష‌న్ చేసే విష‌యం లోకేష్ తో మాట్లాడి..ఏ విధంగా ఆటోన‌గ‌ర్ ను అప్ గ్రేడేష‌న్ చేయాలో ప్ర‌ణాళిక సిద్దం చేసిన‌ట్లు తెలిపారు. ఆటోన‌గ‌ర్ లో ఆటో మొబైల్ వ్యాపారం చేసిన త‌న‌కి...ఇక్క‌డి స‌మ‌స్య‌లు బాగా తెలుసు అన్నారు. కేంద్రం లోనే కాదు రాష్ట్రంలో కూడా ఎన్డీయే ప్ర‌భుత్వం అధికారంలోకి రాబోతుంది. కేంద్రంలో మోదీ ప్ర‌ధాన‌మంత్రిగా , రాష్ట్రంలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా పద‌వీ స్వీకారం చేస్తార‌ని తెలిపారు. 

ఈ కార్య‌క్ర‌మంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్య‌క్షుడు గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు, మోటార్ కార్పెంట‌ర్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు వి.ల‌క్ష్మీనారాయ‌ణ గారు, ఆటోన‌గ‌ర్ మెకానిక్ యూనియ‌ర్ కార్య‌ద‌ర్శి ద‌స్త‌గిరి, పెయింట్ అసోసియేష‌న్ కార్య‌ద‌ర్శి వీరాచారి, ఎపి లారీ అసోసియేష‌న్ అధ్యక్షులు వై.వి. ఈశ్వ‌ర‌రావు, అమ‌రావ‌తి కారు అసోసియేష‌న్ అధ్యక్షులు దివాక‌ర్, ఐలా అధ్య‌క్షులు దుర్గ‌ప్ర‌సాద్, శాస‌న‌మండలి మాజీ చైర్మ‌న్ ష‌రీష్,  ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు నెట్టెం రఘురామ్,  తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి గ‌ద్దె రామ్మోహ‌న్, పెన‌మ‌లూరు ఎమ్మెల్యే అభ్య‌ర్ధి బోడే ప్ర‌సాద్, తెలుగుదేశం నాయ‌కులు బొప్ప‌న భ‌వ‌కుమార్, ఎమ్.ఎస్.బేగ్, చెన్నుపాటి వ‌జీర్,  జ‌న‌సేన ఎన్టీఆర్ జిల్లా స‌మ‌న్వ‌య క‌ర్త అమ్మిశెట్టి వాసు, మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్, బిజెపి తూర్పు నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్ పోతంశెట్టి నాగేశ్వ‌ర‌రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.