చత్తీస్ గడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ ..8 మంది నక్సలైట్ల హతం 

చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కా ల్పుల్లో 8 మంది మావోయిస్టులు నేలకొరిగారు. ఇద్దరు భధ్రతాసిబ్బందికి గాయాలయ్యాయి. చత్తీస్ గడ్ లో ఈ నెల మొదటి వారంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు హాయంలో రెండు ఎన్ కౌంటర్లు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇవ్వాళ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరగడం నక్సలైట్ల ఉనికి లేకుండా పాలకులు యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది. 

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాజనందగావ్ జిల్లా మన్పూర్ అటవీ ప్రాంతం పరిధిలోని పర్దోని దగ్గర మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా నలుగురు మావోయిస్టులు, ఒక ఎస్సై మరణించారు. చనిపోయిన వారిలో సీపీఐ మావోయిస్టు పార్టీ డివిజనల్ కమిటీ మెంబర్ అశోక్, ఏరియా కమిటీ మెంబర్ నరేటి కృష్ణ, దళ సభ్యులు సవిత, పరిమిళ ఉన్నారు. చనిపోయిన ఎస్సై పేరు శ్యామ్ కిషోర్ శర్మ. అయితే ఈ సంఘటనపై పోలీసుల వర్షన్ మాత్రమే ఇప్పటి వరకు తెలిసింది. సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రకటన‌ కానీ, స్థానికులు ‌కానీ ఇంత వరకు మీడియాకు ‍అమ్దుబాటులోకి రాలేదు.
అయితే పోలీసులు మాత్రం ఎప్పుడూ చెప్పే కథనే మళ్ళీ చెప్పారు. వారి కథనం ఏంటంటే....

మామదన్వాడ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్యామ్ కిషోర్ శర్మ నేతృతత్వంలో  జరిగిన ఎన్ కౌంటర్ జరిగిన తీరు హృదయవిదారకంగా జరిగింది.  మన్పూర్ కు నక్సల్స్ ఆపరేషన్ నిమిత్తం కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో అప్పటికే మాటు వేసిన మావోయిస్టులు పోలీసులపై మెరుపుదాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులతో పాటు, ఎస్‌ఐ శ్యామ్ కిషోర్ శర్మ కడుపులోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మావోయిస్టుల నుంచి ఏకే-47, రెండు 315-బోర్‌ రైఫిళ్లు, ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు.