పోటుగాడిపై కన్నేసిన శింబు

 

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం "పోటుగాడు". ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో తమిళ హీరో శింబు కూడా ఓ పాటను పాడిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్ర తమిళ హక్కులను హీరో శింబు సొంతం చేసుకొని, త్వరలోనే ఈ చిత్రంలో తనే హీరోగా నటించనున్నట్లు తెలిసింది. ఈ చిత్ర తమిళ వర్షన్ కి కూడా పవన్ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరి ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu