ప‌వ‌న్‌తో సినిమా చేస్తా

 

ఇన్నాళ్లు చిన్న సినిమాల‌తో సెన్సేష‌న్ సృష్టించిన ఓ డైరెక్టర్ ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాడు. ఇన్నాళ్లు బూతును మాత్రమే న‌మ్ముకొని సినిమాలు చేసిన మారుతి ఈ మ‌ధ్యే ట్రెండ్ మార్చి కాస్త క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తున్నాడు. త‌న‌కు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అన్న ప్రశ్నకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ అయితే లేవు గాని డ్రీమ్ హీరో ఉన్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాన్‌.. అత‌ను ఒప్పుకుంటే అవ‌కాశం ఇస్తే ప‌వ‌న్‌తో ఓ సినిమా చేయాల‌నుంద‌ని ప్రక‌టించాడు.
అయితే రామ్‌గోపాల్ వ‌ర్మ లాంటి స్టార్ డైరెక్టర్లే ప‌వ‌న్ సినిమా చేయలేమని తేల్చేస్తుంటే, మారుతి మాత్రం అవ‌కాశం ఇస్తే ప‌వ‌న్‌తో స‌క్సెస్ ఫుల్ సినిమా చేస్తానంటున్నాడు. మ‌రి మారుతికి ప‌వ‌న్ డేట్స్ ఇస్తాడా.. చూడాలి మ‌రి

Online Jyotish
Tone Academy
KidsOne Telugu