ఇక్కడ ఉండాలంటే కన్నడ నేర్చుకోవాల్సిందే.

 

ఇప్పటికే తమిళనాడులో మాతృభాష విషయంలో అప్పుడప్పుడు వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామయ్య కూడా తమ మాతృభాషపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 62వ కర్ణాటక రాజ్యోత్సవ సమావేశంలో పాల్గొన్న ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌ మాట్లాడుతూ.. త‌మ రాష్ట్రంలో బ్రతికే ప్రతి ఒక్కరూ కన్నడీయులే అని.. త‌మ‌ రాష్ట్రంలో నివసించేవారు ఎవరైనా కచ్చితంగా త‌మ భాష‌ను నేర్చుకోవాల్సిందేన‌ని.. రాష్ట్ర భాష పట్ల ప్రజలు మరింత అభిమానాన్ని ప్రదర్శించాల‌ని.. త‌మ‌ భాషపై ఎటువంటి దాడి జరిగినా ఊరుకోబోమ‌ని తేల్చి చెప్పారు. క‌ర్ణాట‌క‌లోని అన్ని స్కూళ్ల‌లో కన్నడ భాషను తప్పకుండా బోధించాలని చెప్పారు. పరభాష నేర్చుకోవ‌చ్చ‌ని, కన్నడను నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu