ఎస్.ఐ. సిద్ధయ్య అంత్యక్రియలు పూర్తి

 

నల్గొండ జిల్లా జానకిపురంలో దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మంగళవారం కన్నుమూసిన ఎస్ఐ సిద్ధయ్య అంత్యక్రియలు బుధవారం జరిగాయి. అతని భార్య ధరణిమృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. నాలుగు రోజుల క్రితమే మగబిడ్డకు జన్మనిచ్చిన ధరణి కామినేని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి నేరుగా భర్త అంత్యక్రియలకు జడ్చర్ల వచ్చారు. మరోవైపు సిద్ధయ్యను చివరిసారిగా చూసేందుకు జనం  భారీగా తరలివచ్చారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పలువురు రాజకీయ నేతలు, అధికారులు సిద్ధయ్య అంత్యక్రియలలో పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu