భారతదేశంలో మొట్టమొదటి ఓటర్ ఇతనే

భారతదేశంలో ప్రస్తుతం కొన్ని కోట్లమంది ఓటర్లు ఉన్నారు..ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓట్లు వేస్తున్నారు. ఆ విషయం పక్కనబెడితే అసలు దేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా..అతని పేరు శ్యామ్‌శరణ్ నేగి.. హిమాచల్‌ప్రదేశ్‌ కిన్నౌర్ జిల్లాకు చెందిన ఆయన 1951లో దేశంలో తొలిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అందరికన్నా ముందు ఓటు వేశారు. ఆ సమయంలో నేగి ప్రాంతంలో భారీ హిమపాతం కురిసే అవకాశం ఉండటంతో..దేశంలో మిగిలిన ప్రాంతాల కన్నా ముందుగా అక్కడ ఓటింగ్ జరిగింది. 1951 నుంచి 2014 వరకు జరిగిన అన్ని లోక్‌సభ ఎన్నికల్లో, 12 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు..నేడు ఆయన 100వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu