"బీఫ్" పార్శిల్ తీసుకెళ్తున్నాడని..హత్య

బీఫ్ పార్శిల్ తీసుకెళ్తున్నాడని ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపాడు ఓ బీజేపీ నేత. ఝార్ఖండ్‌ రామ్‌గఢ్‌లోని జబార్ టాండ్ ప్రాంతంలో గురువారం అస్గర్ అన్సారీ అనే వ్యక్తి వ్యానులో బీఫ్ తీసుకెళ్తున్నాడని కొందరు దుండగులు అడ్డుకున్నారు. అతన్ని వాహనంలోంచి బయటకు లాగి దారుణంగా కొట్టారు. అనంతరం వ్యానుకు నిప్పుపెట్టారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితున్ని ఆస్పత్రికి తరలించారు..అక్కడ చికిత్స పొందుతూ అన్సారీ మరణించాడు..ప్రజా సంఘాల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావడంతో దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు..ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించగా..దుండగులతో కలిసి దాడికి పాల్పడింది బీజేపీ నేత నిత్యానందేనని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిత్యానంద ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu