కూకట్‌పల్లిలో విషాదం

హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. వివేకానందనగర్‌ సమీపంలో వేగంగా వచ్చిన లారీ ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కూతురు అక్కడికక్కడే మరణించారు. వీరు బీహెచ్ఈఎల్ నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి మొక్కు తీర్చుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంతటి విషాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu