రోడ్డు ప్రమాదంలో శిల్పాశెట్టికి గాయాలు

 

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. పంజాబ్‌లోని కపుర్తలా ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ శిల్పాశెట్టి ప్రయాణిస్తున్న కారును ధిల్లవాన్ టోల్‌ప్లాజా సమీపంలో మరో కారు ఢీకొంది. శిల్పాశెట్టి ఒక స్టోర్ ప్రారంభోత్సవానికి జలంధర్ నుంచి అమృత్‌సర్ వెళ్తున్నారు. ప్రమాదం తర్వాత శిల్పాశెట్టి అంగరక్షకులు ప్రమాదం చేసిన కారు డ్రైవర్‌తో గొడవపడ్డారు. అయితే స్వల్పంగా గాయపడిన శిల్పాశెట్టి మరోకారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కారులోనే శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా వున్నారని, ఆయనకు కూడా స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu