యూపిఎ పై సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస౦

 

 

 

రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్ర టిడిపి ఎంపీలు యూపిఎ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ సభాపతి మీరా కుమార్‌కు నోటిసు ఇచ్చారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొణకళ్ల నారాయణ, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప స్పీకర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చారు.

 

సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీల అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభాపతి మీరా కుమార్‌కు సోమవారం అవిశ్వాస నోటీసులు అందజేసింది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర ఎంపీలు వరుసగా అవిశ్వాస నోటీసులు ఇస్తున్నారు. ఆ పార్టీ ఎంపీలు వైయస్ జగన్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి ముగ్గురు సంతకాలు చేసిన నోటీసును స్పీకర్‌కు అందజేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu