అవిశ్వాస౦పై సోనియా ఆగ్రహం
posted on Dec 9, 2013 5:17PM
.jpg)
యూపీఏ ప్రభుత్వంపై స్వంత పార్టీ ఎంపీలు స్పీకర్ మీరాకుమార్ ను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు ? అని ఆరాతీస్తున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఆరుగురు ఎంపీల మీద చర్యలు తీసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే అన్నింటికి సద్దపడే తాము అవిశ్వాస తీర్మానం స్పీకర్ కు ఇచ్చామని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. సమైక్యాంధ్ర గురించి సీమాంధ్ర ప్రజల నుండి తమ మీద తీవ్ర వత్తిడి వస్తుందని, అందుకే కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం పెట్టామని ఆయన అన్నారు. తమకు ఊహించని రీతిలో తమ అవిశ్వాసానికి మద్దతు లభిస్తోందని ఎవరు ఎప్పుడు తమకు మద్దతు తెలుపుతారో చెప్పలేమని అన్నారు. అయితే అవిశ్వాస తీర్మానం సమర్ధంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు.