లగడపాటి వల్లే రెండో ఎస్సార్సీ : ఎంపీ సర్వే
posted on Nov 11, 2011 8:26AM
న్యూ
ఢిల్లీ: రెండో ఎస్సార్సీకి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి సంబంధం లేదని సీమాంధ్ర పెట్టుబడిదారుల్లో ఒకరైన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వంటివారివల్ల రెండో ఎస్సార్సీ తెరపైకి వచ్చిందని మల్కాజ్‌గిరి ఎంపీ సర్వే సత్యనారాయణ ఆరోపించారు.చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ వేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ సర్వే సత్యనారాయణ సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రెండో ఎస్సార్సీ అనేది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వరకే పరిమితమవుతుందన్నారు.
లగడపాటికి మరికొందరు సీమాంధ్ర పెట్టుబడిదారులు మద్దతు పలుకుతున్నారన్నారు. అందుకే గతంలో తెలంగాణకు సై అన్న నేతలు ఇపుడు నై అంటున్నారని సర్వే విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర కల త్వరలోనే సాకారం కానుందని సర్వే జోస్యం చెప్పారు.