కోనేరుప్రసాద్‌కు కస్టడీ పొడిగింపు

హైదరాబాద్:కోనేరు ప్రసాద్ విచారణలో తమకు సహకరించలేదని, మరిన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టుకు చెప్పుకుంది. కోనేరు ప్రసాద్ 30 కోట్ల రూపాయల లావాదేవీలను మాత్రమే వివరించారని, మరో 90 కోట్ల రూపాయల లావాదేవీల గురించి చెప్పాల్సి ఉందని సిబిఐ చెప్పింది.అంతే కాకా ఎమ్మార్‌ అక్రమాలపై కొంత సమాచారం రాబట్టామని, అధికారులు, నేతల పాత్రను తెలుసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రసాద్‌ రెండు రోజులుగా సీబీఐకి సహకరించడంలేదని సీబీఐ న్యాయవాది కోర్టుకు వివరించారు.

కాగా  కోనేరు ప్రసాద్‌ను మరో ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు తమ ముందు కోనేరు ప్రసాద్‌ను ప్రవేశపెట్టాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. కోనేరు ప్రసాద్‌కు సిబిఐ కార్యాలయంలో ఓ గదిని కేటాయించాలని కూడా కోర్టు ఆదేశించింది.సిబిఐ  కస్టడీ ముగియడంతో కోనేరు ప్రసాద్‌ను  గురువారం కోర్టు ముందు హాజరు పరిచింది.కోనేరు ప్రసాద్‌ను మరింత కాలం తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోరింది.దాన్ని వ్యతిరేకిస్తూ మరింత కాలం సిబిఐ కస్టడీకి ఇవ్వడమంటే తనను వేధించడమేనని ఆయన అన్నారు. సిబిఐ తనను మానసికంగా వేధించిందని ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో అరెస్టయిన స్టైలిష్ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోనేరు ప్రసాద్ కోర్టుకు చెప్పుకున్నారు. ఏడు రోజుల కస్టడీలో కోనేరు ప్రసాద్‌ను రెండు రోజులు పూర్తిగా విచారించారని, ఆ తర్వాత అప్పుడప్పుడు ప్రశ్సిస్తూ వచ్చారని, చివరి రెండు రోజులు విచారించకుండా వ్యర్థంగా కూర్చోబెట్టారని కోనేరు ప్రసాద్ తరఫు న్యాయవాది అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu