‘సత్యం’ కేసు పూర్తి వివరాలు



‘సత్యం’ కుంభకోణం కేసులో రామలింగరాజుతోపాటు ఇతర నిందితుల మీద నేరం రుజువైన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు..

* 2009 జనవరి 7న సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

*  లేని లాభాలను ఉన్నట్టు చూపినట్టు బయటపడింది.

* 2009 జనవరి 9న సీఐడీ కేసు నమోదు. రామలింగరాజు అరెస్టు.

* నిందితులుగా రామలింగరాజు, రామరాజు, సూర్యనారాయణ రాజు, వడ్లమాని శ్రీనివాస్, ఆడిటర్లు గోపాలకృష్ణన్, తాళ్ళూరి శ్రీనివాస్, మాజీ ఉద్యోగులు రామకృష్ణ, వెంకటపతిరాజు, శ్రీశైలం, అంతర్గత ఆడిటర్ ప్రభాకర్‌ గుప్తాపై కేసు నమోదు.

* 2009 ఫిబ్రవరి 9న కేసు నమోదు. రామలింగరాజు అరెస్టు.

* ఐపీసీ 120 బీ, 420, 409, 467, 471, 477ఎ, 201 సెక్షన్ల కింద కేసు నమోదు.

* 2009 ఫిబ్రవరి 16న రంగంలోకి దిగిన సీబీఐ.

* మూడు అభియోగపత్రాలను కలిపి ప్రత్యేక న్యాయస్థానం విచారణ.

* 2011 నవంబర్ 4న రామలింగరాజుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

* మదుపుదారుల నష్టంతో కలిపి ఈ కుంభకోణం విలువ 14 వేల కోట్లుగా సీబీఐ తేల్చింది.

* కుంభకోణం ద్వారా రామలింగరాజు, ఇతర నిందితులు కలసి 2743 కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధరించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu