సత్యసాయి బాబా ఇక లేరు
posted on Apr 24, 2011 10:16AM
పుట్టపర్తి: భ
గవాన్ సత్యసాయి బాబా ఆదివారం తుదిశ్వాస విడిచారు. భౌతికంగా ఆయన భక్తులకు దూరమయ్యారు. ఈ ఉదయం 7.38 నిమిషాలను సత్యసాయి బాబా దేహాన్ని వదిలి వెళ్లినట్టు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. గత 28 రోజులుగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబా ఈ రోజు లోకాన్ని విడిచారు. బాబా మరణంతో పుట్టపర్తిలో విషాద వాతావరణం నెలకొంది. బాబా నిర్యాణం వార్త విని భక్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాబా ఇక లేరు అన్న వార్తను తెలుసున్న ఒక మహిళ పుట్టపర్తిలో కుప్పకూలిపోయారు. అలాగే, దేశ విదేశాలకు చెందిన బాబా భక్తులు పుట్టపర్తికి చేరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి ఎన్.రఘువీరా రెడ్డి అనంతపురం నుంచి పుట్టపర్తికి బయలుదేరారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ పుట్టపర్తికి వెళ్లాలని నిర్ణయించారు. మరికొద్ది సేపట్లో వీరు పుట్టపర్తికి బయలుదేరతారు.
బాబా పార్థివ శరీరాన్ని భక్తుల సందర్శనార్థం కుల్వంత్ హాల్‌కు నేటి సాయంత్రం తరలించనున్నారు. భక్తుల సందర్శనార్ధం రెండురోజులు అక్కడే ఉంచనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం వరకు భక్తుల సందర్శనార్థం కుల్వంత్ హాలులో ఉంచుతారు.