జైలులో శశికళ.. బాగా చిక్కిపోయారు..!

 

అక్రమాస్తుల కేసులో భాగంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి అయిన శశికళ బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జైలుకు వెళ్లిన కొత్తలో ఆమె పార్టీ నేతలను కలుస్తూ బిజీ బిజీగా ఉండేవారు. ఆమెను కలవడానికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. అయితే క్రమంగా పరిస్థితి మారింది. చిన్నమ్మను చూడటానికి వచ్చేవారి సంఖ్య తగ్గింది. ఇక చిన్నమ్మ కూడా అందరినీ కలవడానికి అంత ఆసక్తి చూపించలేదు. కానీ తాజాగా మంత్రి బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాస్, తంగ తమిళ్ సెల్వన్, వెట్రివేల్, మాజీ మంత్రి బీవీ రమణలు శశికళతో భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

 

అయితే ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి నేతలు చిన్నమ్మకు వివరించినట్టు తెలుస్తోంది. అయితే జైలు నుండి బయటకు వచ్చిన నేతలు మాట్లాడుతూ.. జైలులోని ఆహారం సరిగా లేకపోవడంతో శశికళ బాగా చిక్కిపోయినట్టు తెలిపారు. అయితే ఆమె పూర్తి మనోధైర్యంతో ఉన్నారని చెప్పారు. దీంతో ఇప్పుడు మరికొంత మంది చిన్నమ్మను కలవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu