అలా అయితే జైల్లో ఉండేవాడిని...!

 

ఆప్ బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఓ పారిశ్రామిక వేత్త దగ్గర నుండి రెండు కోట్లు లంచంగా తీసుకున్నారని ఆరోపణలు చేసిన మిశ్రా ఆరోజు నుండి ఈరోజు వరకూ ఏదో ఒక విషయం బయటపెడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేజ్రీవాల్‌ కపిల్‌ మిశ్రా తనపై చేసిన అవినీతి ఆరోపణలను కొట్టిపారేశారు. ఇవి నిరాధార ఆరోపణలని, వీటిని ప్రత్యర్థులు సైతం నమ్మడం లేదని పేర్కొన్నారు. ఆ ఆరోపణల్లో ఏమాత్రం పస ఉన్నా తాను ఈపాటికి జైలులో ఉండేవాడినని.. తాను ఏ చిన్న కుంభకోణానికి పాల్పడినా కేంద్రంలోని బీజేపీ తనను జైలులో వేసేదని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu