శశికళ సీఎం అవ్వకుండా ఆపలేరు...
posted on Feb 7, 2017 4:33PM
.jpg)
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై పార్టీ సీనియర్ నేత పాండ్యన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై పార్టీలో కొంతమంది నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత పీఎస్ రామచంద్రన్ స్పందించి.. జయలలితపై విష ప్రయోగం జరిగిందా? లేదా? అనే విషయం వైద్యులు మాత్రమే చెప్పగలరని అన్నారు. పాండ్యన్ కుటుంబానికి చెందిన ఐదుగురు పదవులు అనుభవించారని, ఇప్పుడు తమ పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. అన్నాడీఎంకే పార్టీ శ్రేణులను పాండ్యన్ బదర్స్ గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోనేత సెంగొట్టవన్ మాట్లాడుతూ... చిన్నమ్మ శశికళ నటరాజన్‌ను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని తేల్చిచెప్పారు.
కాగా శశికళ ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలు... ఆమె గుణగణాలు, ప్రవర్తన అన్నీ అనుమానాస్పదమే.. ఆమె వ్యవహార శైలిపై విచారణ జరిపించాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తన ఇంట్లోనే తనకు నెమ్మదిగా విషం పెడుతున్నట్టు జయలలిత తన వద్ద భయాన్ని, ఆందోళనను వ్యక్తం చేశారని.. ఆమె ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని ప్యాండన్ చెప్పిన సంగతి కూడా విదితమే.