జోకులను ఎలా ఆపగలం..
posted on Feb 7, 2017 4:17PM
.jpg)
సర్ధార్ జోకులపై ఎప్పటినుండో కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. సర్ధార్ జోకులను అడ్డుకట్ట వేయాలని హర్వీందర్ చౌదరి అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సర్దార్ జోకులపై నిషేధం విధించడాన్ని తిరస్కరించింది. సిక్కులకు సమాజంలో చాలా గౌరవముందని, ఇలాంటి పిటిషన్ల ద్వారా దాన్ని తగ్గించుకోవద్దని కోర్టు తెలిపింది. ఒకవేళ కోర్టు మార్గదర్శకాలు జారీ చేస్తే మాత్రం వాటిని ఎలా అమలు చేస్తాం.. ఎవరు పాటిస్తారు అని ప్రశ్నించింది. అంతేకాదు పౌరులకు నైతికపరమైన మార్గదర్శకాలను ఇవ్వలేమని, అలాంటి ఆదేశాలిచ్చి వాటిని పాటించేలా చేయడం అసాధ్యమని.. జోకులు అనేవి సమాజానికి, మనస్తత్వానికి సంబంధించిన అంశమని పేర్కొంది.