కృష్ణాజిల్లాలో రెండేళ్ళలో రూ.1,335 కోట్ల మద్యం అమ్మకాలు

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నా మద్యం అమ్మకాల్లో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 2011 ఏప్రిల్ నుంచి 2012 మార్చి వరకూ ఈ జిల్లాలో సుమారు 815 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని విక్రయించారు. గత ఏడాది ఇదే కాలంలో 540 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. అంటే ఈ రెండేళ్ళలో కృష్ణాజిల్లా వాసులు 1,355 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని తాగేశారన్నమాట. నిజానికి ఈ రేట్లన్నీ ఎం.ఆర్.పి. ధరల ప్రకారం అంచనా వేసినవే. కానీ, గత రెండేళ్ళుగా ఎం.ఆర్.పి.పై 35 నుంచి 40 శాతం ఎక్కువ రేటుకు జిల్లాలో మద్యం విక్రయించారు.

 

 

దీన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే మద్యం అమ్మకాలు రూ.1800 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. ఈ ఏడాది జనవరిలో రూ.53 కోట్ల రూపాయల విలువైన మద్యం, ఫిబ్రవరిలో రూ.57 కోట్ల రూపాయల మద్యం, మార్చిలో రూ. 76 కోట్ల విలువైన మద్యం, ఏప్రిల్ లో రూ.79 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని కృష్ణాజిల్లాలో విక్రయించారు. నాలుగు సంవత్సరాల్లో జిల్లాలో ఎక్సైజ్ ఆదాయం రెట్టింపు అయ్యింది. మద్యం అమ్మకాల్లో ఈ జిల్లా రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కన్నా ఎంతో ముందు నిలిచింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu