రాజంపేటలో తెలుగుదేశంపార్టీకి ఝలక్!
posted on May 2, 2012 9:45AM
కడపజిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విభేదాలతో సతమతమతుతోంది. ఈ నియోజకవర్గ టిక్కెట్టును బ్రహ్మయ్యకు అప్పటించటం పట్ల మాజీ ఎమ్మెల్యే మదనమోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన సహచరులు, అభిమానులు తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారు. మదనమోహన్ రెడ్డిని బుజ్జగించడానికి చంద్రబాబునాయుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మదనమోహన్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని చంద్రబాబు చేసిన వాగ్దానాన్ని ఆయన వర్గీయులు విశ్వసించటం లేదు. పార్టీ ఫిరాయింపు దారుడైన బ్రహ్మయ్యకు టిక్కెట్టు ఇచ్చి తమ నాయకుడు మదనమోహన్ రెడ్డిని అవమానించారని ఆవేదన చెందుతున్నారు. త్వరలోనే వీరు తమ పార్టీ పదవులకు, పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేయబోతున్నట్లు తెలిసింది.