సచిన్ తమాషా ట్విట్
posted on Sep 26, 2014 2:12PM
.jpg)
ఏమో అనుకున్నాంగానీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌లో కూడా మంచి చతురత వుంది. సచిన్‌లోని ఈ చతురత బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా ముంబయి క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన అమోల్ మజుందార్ రిటైర్మెంట్ సందర్భంగా బయటపడింది. సాధారణంగా క్రికెట్లో ఎవరైనా రిటైర్ అయితే వారికి అభినందనలు చెప్పడం, తమరు క్రికెట్‌కి బోలెడంత సేవ చేశారు అనడం మామూలే. అయితే సచిన్ మాత్రం అలాంటి అభినందనలు కాకుండా ‘స్వాగతం’ అని ట్విట్టర్లో తమాషా ట్విట్ చేశాడు. మామూలుగా శుభాకాంక్షలు చెబుతూనే, అమోల్ మజుందార్ క్రికెట్‌కి చేసిన సేవలను గుర్తుచేస్తూనే మా మా రిటైర్డ్ బ్యాచ్‌లోకి నీక్కూడా స్వాగతం అని ట్విట్ చేశాడు. ఇప్పుడు సచిన్ చేసిన ఈ తమాషా ట్విట్ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిగ్గా మారింది.