రుద్రమదేవి గెటప్ లో అనుష్క

 

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "రుద్రమదేవి". ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. ఈ చిత్రంలో అనుష్క గెటప్ ఇదే. ఈ సినిమా కోసం అనుష్క గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం వంటివి నేర్చుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ఇటీవలే చిత్రీకరించారు. ఈ చిత్రంలో రానా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.