లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎగువ అహోబిలం రహదారిలో అదుపుతప్పి ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలంకు వస్తుండగా  ఈ  ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో లోయలో పడిపోగానే ప్రయాణికులు కేకలు వేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సులో నుంచి ప్రయాణికులను బయటికి తీశారు. క్షతగాత్రులు స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.వాళ్లను మెరుగైన చికిత్స కోసం కర్నూల్ హాస్పిటల్ కు తరలించారు.