అత్యాచారాలు జరగడానికి అదే కారణం... ఆర్ఎస్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు..
posted on Jun 3, 2017 5:39PM

ఆడవాళ్లపై అత్యాచారాలు జరగడానికి వారి డ్రస్సింగే కారణమని.. వాటివల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని ఇప్పటికి చాలా మంది నేతలే అన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా వారి జాబితాలో చేరిపోయారు. ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ పాశ్చాత్య సంస్కృతి వల్లే భారత్ లో మహిళలపై అత్యాచారలు, హింస వంటి నేరాలు పెరిగిపోతున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ లో ప్రేమకు అత్యంత పవిత్రమైనదిగా, భక్తిగలదిగా ఉంటే.. పాశ్చాత్య సంస్కృతి, సంప్రదాయాలు లవ్ ను వ్యాపారం చేయడంతో పాటు వాలెంటైన్స్ డే లాంటి పండగలకు జన్మనిచ్చాయని మండిపడ్డారు. ‘ప్రేమ స్వచ్ఛమైంది. కానీ పాశ్చాత్య సంస్కృతులు ఓ ఫ్యాషన్‌గా, బిజినెస్‌గా మార్చింది. ఆ సంస్కృతి వల్ల తలాక్, అత్యాచారాలు, గృహహింస, గర్భంలోనే ఆడ శిశువును చంపేస్తున్నాయి’ అని ఆయన అన్నారు.