రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు
posted on Sep 21, 2015 12:12PM

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో అమలవుతున్న రిజర్వేషన్లు, ఇతర అంశాలపై అధ్యయనానికి ఒక కమిటీని వేయాలని ఆయన సూచించారు, రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి? ఎంతకాలం ఇవ్వాలి? అనే అంశాలపై స్టడీ చేయాల్సిన అవసరముందన్నారు. పటేళ్లకు కూడా రిజర్వేషన్లు కల్పించాలంటూ గుజరాత్ లో హార్దిక్ పటేల్ డిమాండ్ చేస్తున్న క్రమంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.బీజేపీకి సిద్ధాంతకర్తయైన ఆర్ఎస్ఎస్ చేసిన సూచనలను ఎన్డీఏ ప్రభుత్వం స్వీకరిస్తుందో లేక లైట్ సుకుంటుందో తెలియదు గానీ, ఒకవేళ మోహన్ భగవత్ సలహా మేరకు కమిటీ వేస్తే కనుక కొత్త సమస్యలు తప్పవంటున్నారు మేధావులు