సింగపూర్ లో సీఎం బిజీబిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ తో విందు భేటీలో పాల్గొన్న బాబు బృందం...స్విస్ ఛాలెంజ్ విధానం, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై చర్చించారు. ఇవాళ సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కీలకోపన్యాసం చేయనున్న చంద్రబాబు...ఆ తర్వాత సింగపూర్ కన్సార్టియం ఇచ్చే విందులోనూ పాల్గొననున్నారు. అనంతరం అమరావతి నిర్మాణం, మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులుచేర్పులు, భవనాల ఆర్కిటెక్చర్‌ పై సింగపూర్ ప్రతినిధులతో చర్చించనున్నారు. చివరిగా సింగపూర్ ప్రధాని లూంగ్ తో భేటీకానున్న బాబు... నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రాన్ని అందించనున్నారు.