మిస్టర్ వరల్డ్‌గా తొలి భారతీయుడు.. మన హైదరాబాదీనే..

భారతదేశాన్ని తొలి "మిస్టర్ వరల్డ్" టైటిల్ వరించింది. హైదరాబాద్‌కు చెందిన మోడల్, నటుడు రోహిత్ ఖండేల్వాల్ దీన్ని సాధించారు. ప్రపంచంలోని 46 దేశాల నుంచి ఎంతో మంది అందగాళ్లు హాజరైనా వారందరని పక్కకు నెట్టి  రోహిత్ "మిస్టర్ వరల్డ్" టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

 

బ్రిటన్‌లోని సౌత్‌పోర్ట్ థియేటర్‌లో మంగళవారం రాత్రి ఫైనల్ జరిగింది. ప్రముఖ డిజైనర్ నివేదిత సాబూ సిద్ధం చేసిన వస్త్రాలు ధరించి రోహిత్ తుది సమరానికి హాజరై టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. ఈ టైటిల్‌తో పాటు ప్రపంచ మల్టీమీడియా అవార్డు, ప్రపంచ టాలెంట్, మాబ్‌స్టార్ పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ లాంటి సబ్‌ టైటిల్స్ కూడా గెలుచుకున్నాడు. అవార్డు కింద రోహిత్‌కు రూ.33.62 లక్షల నగదు బహుమతి లభించింది. ప్యూర్టోరికోకు చెందిన ఫెర్నాండో అల్వారేజ్, మెక్సికోవాసి ఆల్డో ఎస్పార్జా ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నారు. రోహిత్ తొలిసారిగా ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడు మాత్రమే కాదు..మిస్టర్‌ వరల్డ్‌గా ఎంపికైన తొలి ఆసియా వాసి.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu