రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

 

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా ధామ్‌పూర్ దగ్గర ట్రక్కు - వ్యాను ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మొరాదాబాద్‌కి చెందిన వీరు వివాహ వేడుకకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగతింది. వ్యాన్ డ్రైవర్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న ట్రక్కుని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. గాయపడిన వారి పరిస్థితి విషమంగా వుంది. అలాగే కరీంనగర్ జిల్లా కోరుట్ల శివారులో ఒక పెళ్ళి వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారంలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. పెళ్ళి బృందం రుద్రంగి నుంచి మందమర్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu