మంత్రి పల్లె కాలికి గాయం

 

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సచివాలయంలోని తన గదిలో జారిపడ్డారు. దాంతో ఆయనకు గాయాలయ్యాయి. గాయపడిన మంత్రి రఘునాథరెడ్డిని భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఫ్లోరింగ్ మీద నీళ్లు పడటం వల్ల ఆయన జారి పడినట్టు తెలుస్తోంది. కాలికి గాయమై రక్తస్రావం అయినట్టు సమాచారం. ఆందోళనపడాల్సినదేమీ లేదని తెలుస్తోంది. అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే అయిన పల్లె రఘునాథరెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చురుకుగా పనిచేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu