రాక్ స్టార్ గా వస్తున్న రేయ్
posted on Nov 25, 2013 9:21AM

సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం "రేయ్". వైవియస్ చౌదరి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రంలో సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ... అతడో రాక్ స్టార్. సంగీతంలోనే కాకుండా జీవితంలో కూడా రాకింగ్ గానే ఉండాలనుకునే తత్త్వం అతనిది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాక్ స్టార్ గా ఎదగాలన్నది అతని కోరిక. ఈ క్రమంలో ఎదగాలన్నది అతని కోరిక. మరి ఈ క్రమంలో అతనికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది తెరపైనే చూడాలి అని అంటున్నాడు. దర్శకుడు మాట్లాడుతూ...రెండు దేశాల నేపధ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. తొలి సగభాగం వెస్టిండీస్ సంస్కృతీ, మలిభాగం అమెరికా నేపధ్యంలో ఉంటుంది. సాయిధరమ్ తేజ్ పాత్ర నేటి యువతకు అద్దం పట్టేలా ఉంటుంది. చక్రి అందించిన పాటలను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేస్తామని అన్నారు.