విష్ణు కోరిన పుట్టినరోజు కోరిక

 

"దేనికైనా రెడీ", "దూసుకేల్తా" చిత్ర విజయాలతో చాలా ఆనందంగా ఉన్న మంచు విష్ణు పుట్టినరోజు నేడు. ప్రస్తుతం విష్ణు "పాండవులు పాండవులు తుమ్మెద" చిత్రంలో నటిస్తున్నాడు. అయితే విష్ణు పుట్టినరోజున ఒక పెద్ద కోరిక కోరుకుంటున్నాడు. విష్ణు ఇద్దరు కూతుళ్ళు అరియానా, వివియానాలకు ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయంట. దాంతో వాళ్ళ నోటి నుండి "హ్యాపీ బర్త్ డే డాడీ" అనే మాట వినాలని విష్ణు ఆశగా ఎదురుచూస్తున్నాడు. వాళ్ళు అలా చెప్తే అదొక మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది అని చెప్తున్నాడు విష్ణు. మరి విష్ణు కోరిక ఈ పుట్టినరోజుకి నెరవేరుతుందో లేక వచ్చే ఏడాది పుట్టినరోజుకి నెరవేరుతుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu