హీరోయిన్ గా వస్తున్న కరీనా కూతురు..!

 

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కు ఇటీవలే కరీనాకపూర్ తో వివాహం జరిగింది. త్వరలోనే కరీనా కూతురు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటీ.. కరీనా సైఫ్ లకు పిల్లలే లేరు కదా. మరి ఈ కూతురు ఎలా వచ్చింది. అపుడే హీరోయిన్ గా ఎలా ఎదిగింది అని అనుకుంటున్నారా?

 

అసలు విషయం ఏమిటంటే... సైఫ్ తన మొదటి భార్య అమ్రిత్ తో 2004 లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత సైఫ్ ఇటీవలే కరీనాను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే సైఫ్-అమ్రిత్ ల కూతురు అయిన సారా, ఇపుడు కరీనాకు కూడా కూతురు వరసే అవుతుంది కదా. సారా త్వరలోనే సినీరంగ ప్రవేశం చేయడానికి సిద్దంగా ఉందని తెలిసింది. సారా ఎంట్రీపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సైఫ్ చెప్తున్నాడు.

 

మరి సారా ఒకవేళ సినిమాల్లోకి వస్తే ఈ తల్లికూతుళ్ళ మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu