రేవంత్ రెడ్డికి నాలుగు రోజుల కస్టడీ

రేవంత్ రెడ్డి కస్టడీపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. రేవంత్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలకు నాలుగు రోజుల పాటు కస్టడీ విధించింది. నాలుగు రోజులూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు కస్టడీలో తీసుకుంటారు. అయితే అడ్వకేట్ సమక్షంలో వీరికి విచారణ జరపాలని, కస్టడీ అనంతరం నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 9వ తేదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu