రాష్ట్రాన్ని పాలించే సత్తా తెరాసకు ఉంది.. ఈటెల

ఈ ఏడాది కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చాలా చేసిందని, రాష్ట్రాన్ని పాలించే సత్తా తెరాసకు ఉందని తెలంగాణ ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బేగంపేటలోని బంగారు తెలంగాణపై జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే తమ లక్ష్యమని, తెలంగాణ ప్రభుత్వం అనుక్షణం పేదల కోసమే పనిచేస్తుందని అన్నారు. ఇక తెలంగాణలో ఆకలి కేకలు వినిపించకూడదని, పేదలకు ఎటువంటి కష్టాలు రాకుండా చూడటమే తమ బాధ్యతని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu