రేవంత్ ధైర్యం ఏమిటి?

 

తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ అదుపులోకి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన అరెస్టు అయిన సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. పోలీసులు రేవంత్ రెడ్డి అరెస్టు చేసి కారులో ఎక్కిస్తున్న సమయంలో ఆయన మీసం మెలితిప్పుతూ కేసీఆర్ సంగతి తెలుస్తానని, ఆయన బట్టలు విప్పి రోడ్డు మీద కొట్టిస్తానని శపథం చేశారు. రేవంత్ రెడ్డి ఇంత ఆగ్రహంగా  స్పందించడం వెనుక వున్న ఆయన ధైర్యం ఏమిటన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది.

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా వున్న రేవంత్ రెడ్డి అంటే అధికార టీఆర్ఎస్‌కి కాస్తంత గుబులే. తన లాజిక్కులతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రేవంత్ రెడ్డి అంటే కాస్తంత బెదురే. అందుకే ఆయన అసెంబ్లీలో మాట్లాడకుండా అధికార టీఆర్ఎస్ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వుంటుంది. కేసీఆర్ కన్ను తనమీద వుందని తెలిసి కూడా రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోవడం ఒక ఆశ్చర్యకరమైన అంశమైతే, అరెస్టు అయిన సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్‌కి వ్యతిరేకంగా ధైర్యంగా కామెంట్ చేయడం మరో ఆశ్చర్యకరమైన విషయం. ఆరోజు రేవంత్ రెడ్డి ఏదో ఆవేశంలో అలా అన్నారా.. లేక కేసీఆర్‌కి సంబంధించిన గుట్టు ఏదైనా రేవంత్ రెడ్డి దగ్గర వుందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu