Latest News
ఆ జంతువుల్లో వీళ్ళూ ఉన్నారేమో!
posted on: Jun 3, 2015 10:20PM

జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గత సంవత్సర కాలంగా జరిపిన పరిశోధనల్లో 176 కొత్త జంతువులను కనుగొన్నట్టు ప్రకటించింది. ఆ జంతువులలో చేపల జాతికి చెందిన 23 రకాలు, రెండు రకాల పాములు, సాలీడు జాతికి చెందిన 12 రకాల జంతువులతో పాటు పలు ఇతర కొత్త తరహా జంతువులను గుర్తించినట్టు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ సంస్థ గుర్తించిన కొత్త జంతువులలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా వున్నారేమోనన్న సందేహాలు ఇప్పుడున్న రాజకీయాలను, రాజకీయ నాయకులను చూసి విసిగిపోయిన వారికి కలుగుతున్నాయి.
నిరంకుశంగా పరిపాలించే రాజకీయ నాయకులు, అధికారం కోసం ఎంత దిగజారడానికైనా వెనుకాడని నాయకులు, అధికారంలోకి రావడం కోసం సమాజంలో విభేదాలను పెంచే నాయకులు, ఆస్తుల సంపాదన కోసమే రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్న నాయకులు. ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టి తమ పార్టీల్లోకి లాక్కునే రాజకీయ నాయకులు... ఇలాంటి నాయకులు కూడా సదరు కొత్త తరహా జంతువుల లిస్టులో వున్నారేమో.. పూర్తి లిస్టు బయటకి వస్తేగానీ తెలియదు.






