రాజీనామా చేసేశా.. ఇంక ఆ పార్టీతో సంబంధం లేదు.. రాజాసింగ్
posted on Jul 28, 2025 1:23PM
.webp)
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ బీజేపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు జోరుగా వినవస్తున్నాయి. ఎంపీ అర్వింద్ కుమార్ కూడా దాదాపుగా రాజాసింగ్ బీజేపీలోకి చేరడానికి ఆయన నుంచి ఒక్క మిస్డ్ కాల్ చాలు అంటూ పాజిటివ్ గా మాట్లాడారు. అయితే తాను మళ్లీ కమలం గూటికి చేరనున్నట్లు వస్తున్న వార్తలను రాజాసింగ్ నిర్ద్వంద్వంగా ఖండించారు.
అన్నీ ఆలోచించుకునే రాజీనామా చేశాననన ఆయన ఇక ఆ విషయం గురించి ఆలోచించనని పేర్కొన్నారు. కమలం పార్టీలోని పున: ప్రవేశానికి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కార్యకర్తల బృందాన్ని తాను పంపినట్లుగా వచ్చిన వార్తలను రాజాసింగ్ ఖండించారు. తన రాజీనామా వెనుక ఎటువంటి కుట్రా లేదనీ చెప్పిన ఆయన, అమిత్ షా నుంచి తనకు ఎటువంటి ఫోన్ రాలేదని క్లారిటీ ఇచ్చారు.