టీడీపీ ఎమ్మెల్యేలు అందుకే పార్టీ మారలేదట

కొద్ది రోజుల క్రితం ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఐన వైసిపిలోకి జంప్ అంటూ వార్తలు వచ్చాయి. ఒక పక్క మహానాడు జరగబోతుండగా మరో పక్క ఆ ఎమ్మెల్యేలు వైసిపి కీలక నేతలతో చర్చలు పూర్తయ్యాయి ఇక పార్టీ మారడమే.. అని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఐతే తరువాత ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారడం లేదని కావాలనే కొంత మంది తమ పై కుట్ర చేస్తున్నారని మీడియా ముందు వివరణ ఇవ్వడం జరిగింది. ఐతే ఇది మహానాడు టైం లో కేవలం చంద్రబాబును ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం తో వైసిపి పార్టీ వేసిన ప్లాన్ మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. వైసిపికి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపధ్యం లో ఆ పార్టీకి వేరే పార్టీ ఎమ్మెల్యేల తో పనేంటని వారు అంటున్నారు. ఐతే తమ పార్టీలోకి వచ్చే వారికీ ఎటువంటి రాచమర్యాదలు ఉండవని కేవలం వారి నియోజకవర్గం పనుల్లో ప్రభుత్వ సహకారం ఉంటుందని వైసిపి నేతలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయం లో ఇప్పటికే టీడీపీ ని వీడి వైసిపిలో చేరిన వంశీ, మద్దాలి గిరి వంటి వారికి తమ నియోజక వర్గాల్లో ఆల్రెడీ ఉన్న పార్టీ నాయకుల హవా నడుస్తున్న నేపథ్యంలో వీరికి పెద్దగా ఒరిగిందేమి లేదని టాక్. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారే విషయం పక్కన పెట్టేశారని కూడా టాక్ వినిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu