ఇంకేం చేయాలి.. బట్టలూడదీసుకొని తిరగాలా

 

దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని నిన్న లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల చర్చలో కేంద్రమంత్రి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రం నీళ్లు చల్లినంత పని చేసింది. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి ఆర్ధిక లోటు చాలా ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక హోదాపైనే చాలా ఆశలు పెట్టుకుంది. అసలు అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక హోదా కల్సిస్తామని హామీ ఇచ్చిన తరువాతే రాష్ట్ర విభజనకు ఒప్పుకోవండం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా ఒక్కమూటలో ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయంపై బీజేపీ తీరును ఏపీ ఎంపీలు తప్పుబడుతున్నారు.

 

ఈ విషయంపై ఎంపీ తెలుగుదేశం పార్టీ పార్లెమంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు స్పందించి ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేస్తుందని.. గతంలో రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని.. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ తప్పుచేస్తుందని విమర్శించారు. ఈ విషయంలో టిడిపి, బిజెపిలకు నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతలో మీడియా ప్రతినిధులు ప్రత్యేక హోదా గురించి అడిగిన ప్రశ్నలకు సహనం కోల్పోయి.. ప్రత్యేక హోదా కోసం ఇంకేం చేయమంటారు.. బట్టలూడదీసుకుని తిరగమంటారా అని మాట్లాడారు. ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవ్ కళ్యాణ్ ముందండి నజిపిస్తే తాము కూడా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని రాయపాటి అన్నారు.