స్పీడు పెంచిన రవితేజ
posted on Sep 16, 2013 10:13AM
.jpg)
ఇన్నాళ్లు ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ ఇప్పుడ స్పీడు పెంచాడు. బలుపు సక్సెస్‌తో జోరు మీదున్న రవితేజ ఇప్పుడ వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లు వరుసగా సినిమాలు చేసినా.. ఇప్పుడు స్క్రీప్ట్ విషయంలో ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నాడు రవితేజ.
బలుపు సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ ఇప్పుడిప్పుడే సినిమాలు ఒకే చేస్తున్నాడు. బలుపు సినిమాకు కథ రచయిత అయిన బాబి డైరెక్షన్‌లో ఇప్పటికే ఓ సినిమాను ఒకే చేశాడు. వైవియస్ చౌదరి నిర్మిస్తున్న ఈసినిమా ఈ నెలఖరునుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.
దీనితో పాటు సక్సెస్‌ఫుల్ చిత్రాల నిర్మాత బండ్లగణేష్ నిర్మాణంలో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు రవి. ఈ సినిమాకు వీరభద్రం దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్థుతం నాగార్జునతో భాయ్ సినిమా చేస్తున్న వీరభద్రంతో రవితేజ కోసం ఓ మంచి మాస్ మాసాలా ఎంటర్‌టైన్‌మెంట్ సబ్జెక్ట్ రెడీ చేశాడు. భాయ్ సినిమా పూర్తి కాగానే ఈసినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.
అంతే కాదు ఈ రెండు సినిమాలతో పాటు భీమినేని శ్రీనివాస్ డైరెక్షన్‌లో కూడా ఓ సినిమాకు ఓకె చెప్పాడు ఈ మాస్ మహారాజ్. సుడిగాడు సక్సెస్‌తో మంచి జోరుమీదున్న భీమినేని గతంలో రవితేజతో దోంగోడు లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని అందించాడు. ప్రస్థుతం సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటున్న రవితేజ తన కెరీర్‌ను ఎంతవరకు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి.